![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు Podharillu. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 184లో.. శైలు ప్రెగ్నెంట్ అని తెలియడంతో ఆమె తల్లిదండ్రులు శేఖరం, వరాలు తీవ్రంగా షాక్ అవుతారు. నీకు చదువు, స్వేచ్ఛ ఇచ్చింది ఇలాంటి తప్పు చేయడానికా.. మన పరువు ఏం కావాలంటూ శేఖరం బాధపడతాడు. వరాలు కూడా శైలును కొడుతూ.. నీ గురించి గొప్పగా చెప్పుకునే మీ నాన్నను తలదించుకునేలా చేశావే అని ఏడుస్తుంది. కానీ శైలు మాత్రం.. ఇది అబద్ధం.. నేను ఏ తప్పూ చేయలేదు. కానీ ఇప్పుడు నిజం చెప్తే మళ్లీ పెళ్లి గురించి మాట్లాడతారు. కేశవ వచ్చిన తర్వాతే అసలు విషయం చెప్తానని మనసులో అనుకుంటుంది. ఇదిలా ఉండగా సురేష్ కేశవకు ఫోన్ చేసి.. మా చెల్లిని ప్రెగ్నెంట్ చేసి ఎక్కడికి పారిపోయావ్.. ఇక్కడికి రా.. నిన్ను నరికేస్తానంటూ వార్నింగ్ ఇస్తాడు.
వరాలు మాధవకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్తుంది. మీ తమ్ముడి వల్ల మా కూతురు పెళ్లికి ముందే తల్లి కాబోతోంది. మీపై పోలీస్ కేసు పెడతానంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. దీంతో మాధవ ఆగ్రహంతో కేశవపై దాడి చేస్తాడు. అమ్మాయిని పెళ్లికి ముందే తల్లిని చేస్తావా.. రెండు కుటుంబాల పరువు తీస్తావా అంటూ కేశవని మాధవ కొడతాడు. అసలు ఏం జరిగిందో తెలియక కేశవ షాక్‌లో ఉండిపోతాడు. మరోవైపు చక్రి మాత్రం సరదాగా.. కంగ్రాట్స్ రా.. నన్ను పెదనాన్నని చేశావంటూ ఆటపట్టిస్తాడు. కేశవ మాత్రం.
ముద్దు పెట్టుకుంటేనే కడుపు వస్తుందా..అసలు శైలు ఇలా ఎందుకు చెప్తోందంటూ అయోమయంలో పడిపోతాడు.
కేశవ, శైలు ప్రేమ విషయం అందరికీ తెలిసినా ఈ కొత్త సమస్యతో పెద్ది కూడా ఏం చేయాలో అర్థంకాక ఆలోచిస్తాడు. ఒకవేళ కేశవ నిజంగానే తప్పు చేసి ఉంటే వాళ్లిద్దరికి పెళ్లి చేసేద్దామని చక్రి అంటాడు. అయితే మహా మాత్రం..నాకు తెలిసి కేశవ అలాంటి వాడు కాదు. ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది అంటూ అతడిని నమ్ముతుంది. ఇదే సమయంలో మరోవైపు నారాయణ తన పాత స్నేహితులతో ఉండగా దుర్గాప్రసాద్ వచ్చి గొడవకు దిగుతాడు. నారాయణ ఒక్కడే అందరిని ఎదుర్కొన్నా, చివరికి దుర్గాప్రసాద్ వెనక నుంచి కర్రతో తలపై కొట్టి అతడిని పట్టుకుని కారులో తీసుకెళ్తాడు. ఈ ఘటనను సతీష్ చూసి మాధవ, చక్రిలకు చెప్పడానికి బయలుదేర్తాడు. అసలు నిజం తెలుసుకోవాలని కేశవ మళ్లీ శైలుకు ఫోన్ చేస్తాడు. కానీ శైలు ఇంకా అతడిని ఆటపట్టిస్తూ.. అవును.. నేను ప్రెగ్నెంటే. అంతా చేసింది నువ్వే కదా.. నువ్వు తండ్రివి కాబోతున్నావంటూ చెప్తుంది. దీంతో కేశవ ఒక్కసారిగా షాక్ అవుతాడు. నేనే చేశానా..నాకు ఏమీ గుర్తు లేదే అంటూ భయపడిపోతాడు. ఏంట్రా.. ఏం మాట్లాడటం లేదు.. అన్నీ మర్చిపోయావా అంటూ శైలు మరింత ఆటపట్టిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |